కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఆటోలో 30 లీటర్ల నాటుసారాను గుర్తించినట్లు ఎస్ఈబీ సీఐ శివసాగర్ తెలిపారు. సారాతో పాటు ఆటో, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దీన్ని కర్నూలు జిల్లా ఆదోని నుంచి తీసుకొస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అక్రమంగా తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారా పట్టివేత - kadapa latest news
అక్రమంగా తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారాను ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలంలో జరిగింది.
అక్రమంగా తలిస్తున్న 30 లీటర్ల నాటుసారా పట్టివేత