కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సరోజ(55) కడుపులో 30 కిలోల కణితిని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. కొద్దిరోజులుగా ఆమె కడుపు పెరుగుతూ ఉండడం గమనించి వారం రోజుల క్రితం పట్టణంలోని లక్ష్మీకిషోర్ ఆసుపత్రి వైద్యుడు కిషోర్‌రెడ్డిని సంప్రదించారు. ఆయన పరీక్ష చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. కణితి ఇంత పరిమాణంలో ఉండటం చాలా అరుదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
మహిళ కడుపులో 30 కిలోల కణితి - ప్రొద్దుటూరు
మాములుగా అయితే కడుపులో ఒక కిలో నుంచి పది కిలోల కణితిని తొలగించినపుడు మనం చూసుంటాం. కానీ ఓ మహిళ కడుపులో ఏకంగా 30 కిలోల కణితిని వైద్యులు గుర్తించి...తొలగించారు.
మహిళ కడుపులో 30 కిలోల కణితి