'కోదండరాముడికి వెండి కిరీటాలు బహూకరణ' - 'కోదండరాముడికి మూడు వెండి కిరీటాలు
ఒంటిమిట్ట కోదండరాముడికి పెన్నా సిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి మూడు వెండి కిరీటాలు బహూకరించారు.
temple
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడికి పెన్నాసిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి వెండి కిరీటాలను బహూకరించారు. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి..7 కిలోల 960 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు అందజేశారు. ఉత్సవాల సమయంలో సీతారామలక్ష్మణ మూల విరాట్లకు ఈ కిరీటాలను అలంకరిస్తామని అర్చకులు తెలిపారు.