గల్ఫ్ దేశాల నుంచి కడప జిల్లాకు అత్యధికంగా 2848 మంది వచ్చారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. వారిని ఇళ్లలోనే స్వీయ నిర్భంధంలో పెట్టి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం 2500 మంది గల్ఫ్ నుంచి వచ్చిన వారిని వారం రోజుల నుంచి స్వీయ నిర్బంధం చేశామన్న కలెక్టర్... తాజాగా కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2848 మంది వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఆయా మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోల పర్యవేక్షణలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో పెట్టామని... వారికి కాపలాగా పోలీసులు కూడా ఉన్నారన్నారు. భారీ సంఖ్యలో జిల్లాకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చినప్పటికీ... అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. కడప రిమ్స్‌లో ఇప్పటివరకు 11 మంది అనుమానితుల నమూనాలను సేకరించి తిరుపతి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించినా అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి వంద పడకలతో క్వారంటైన్ ఏర్పాటు చేస్తున్నామన్న కలెక్టర్... మార్చి 31 వరకు జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కడప జిల్లాలో 2848 మంది స్వీయ నిర్బంధం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కడప జిల్లాలో 2848 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్ వెల్లడిచారు. వీరంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి జిల్లాకు చాలా మంది వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు.
kadapa district collector
నిత్యావసర వస్తువుల కోసమే ప్రజలు బయటికి రావాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సరిహద్దులు మూసివేశామని తెలిపారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు.