ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు 24 మందికి అనుమతి - కడప జిల్లా తాజా కొవిడ్​ వార్తలు

ప్రొద్దుటూరులోని బాలుర, బాలికల వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు 24 మందికి అనుమతి లభించింది. కొవిడ్​-19 పరీక్షల్లో నెగిటివ్​ ఫలితాలు రావడం వల్ల 24 మందిని తమ ఇళ్లకు పంపించేశారు. మరో 16 మందిని పంపేందుకు వైద్యాధికారులు ఆలోచన చేస్తున్నారు.

24 people released from proddutur quaranine
24 మందిని విడుదల చేసిన ప్రొద్దుటూరు వైద్యాధికారులు

By

Published : May 12, 2020, 1:21 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ పశువైద్య కళాశాలలోని బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ నుంచి 24 మందికి విముక్తి లభించింది. రెండో విడత స్వాబ్ నమూనాల్లో నెగిటివ్ ఫలితాలు రావడం వల్ల 24 మందిని ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం మరో 68 మంది క్వారంటైన్​లో ఉన్నారు. ఆ కళాశాలలోనే బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన మరో క్వారంటైన్​లో 99 మంది ఉన్నారు. అందులో 16 మందికి రెండో విడత స్వాబ్ నమూనాలను కరోనా నిర్ధరణ పరీక్షలకు పంపారు. వారికి కూడా నెగిటివ్ వచ్చినందున... 16 మందిని ఇళ్లకు పంపించే యోచనలో వైద్యాధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details