కడప జిల్లా దువ్వూరు మండలంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. లాక్‌డౌన్ తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని పుల్లారెడ్డిపేటలో ఆదివారం ఒక్కరోజే 22 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఎనిమిది మంది బాధితులు ఉండగా.. తాజాగా నమోదైన కేసులతో ఈ సంఖ్య 30కి చేరింది.
పూల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22 కరోనా పాజిటివ్ కేసులు - kadapa district covid cases
కడప జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలోని పుల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
పూల్లారెడ్డిపేటలో ఒక్కరోజే 22 కరోనా పాజిటివ్ కేసులు.. ఆందోళనలో గ్రామస్థులు