70 ఏళ్ల సమస్య 72 గంటల్లో పరిష్కరించిన మహాయోధుడు మోదీ : కన్నా కడపలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన భాజపా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పలువురు నాయకులకు కాషాయ వస్త్రం కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భాజపా అన్నారు. 70 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించిన మహాయోధుడు ఒక్క మోదీనే అని ప్రశంసల వర్షం కురిపించారు.
కడప ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛభారత్
కడప పర్యటనలో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ నెల 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుట్లు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి ఆయన బస్స్టాండ్ ఆవరణం శుభ్రం చేశారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సందర్శించి బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రి ఆవరణ పరిశీలించి రోగులకు అన్నదానంలో చేశారు.
ఇదీ చదవండి:
'మోదీ ప్రధానమంత్రి కాదు... ప్రధాన సేవకుడు'