కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువు సమీపంలోని రాజీవ్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు.సోమవారం పాఠశాలకు సెలవు రోజు కావడంతో సంజయ్(9),లోకేష్(9)అనే ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి ఈతకు వెళ్లారు.దగ్గరలోనున్న నీటి కుంటలో స్నానానికి దిగి,బురదలో కూరుకుపోయారు.గట్టుపైన ఉన్న మరో ఇద్దరు పరుగెత్తుకెళ్లి,పెద్దలకు విషయం చేరవేసే సరికి ఆ ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు.ఘటనా స్థలానికి చేరుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపించారు.జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు అక్కడికి చేరుకుని పరిస్థిని సమీక్షించారు.
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి - jammalamadugu
కడప జిల్లా గూడెంచెరువు రాజీవ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఘటన స్థలం వద్దకు చేరుకుని విలపిస్తున్న తల్లిదండ్రలను చూసి, స్థానికులు కంటతడిపెట్టారు.
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి