కడప జిల్లా రాయచోటి పురపాలక పరిధిలోని పాత గొల్లపల్లెలో గురువారం 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. రోజు మాదిరిగా గొర్రెలమంద యజమాని నాగరాజు వీటిని మేపు కొనేందుకు పొలానికి తీసుకెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారి మధ్యలోనే కిందపడిపోయాయి. యజమాని వాటిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృత్యువాతపడ్డాయి. పశు వైద్యాధికారి ఘటనా స్థలానికి వచ్చి గొర్రెలను పరిశీలించి చినుకు వ్యాధితో చనిపోయినట్టు తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధితుడు వేడుకుంటున్నాడు.
చినుకు వ్యాధితో 15 గొర్రెల మృత్యువాత
పాత గొల్లపల్లెలో చినుకు వ్యాధితో 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గురువారం గొర్రెలమంద యజమాని నాగరాజు వీటిని మేపుకునేందుకు పొలానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కిందపడిపోయాయి. గొర్రెల కడుపు ఉబ్బరం చూసి ఆందోళన చెందిన యజమాని పశువైద్యాధికారి వద్దకు తరలించే లోపే మృతి చెందాయి. ఘటనా స్థలానికి వచ్చిన వైద్యాధికారి పరిశీలించి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.
బోరుమంటూ విలపిస్తున్న గొర్రెల యజమాని నాగరాజు