ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Smugglers: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 13మంది అరెస్ట్

కడప జిల్లాలోని పోరుమామిళ్ల, వీరబల్లి మండలాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. 13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల(Smugglers)ను అరెస్టు చేసి.. 57 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

red sandal smugglers arrested in kadapa
అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 13మంది స్మగ్లర్లు అరెస్ట్

By

Published : Jun 21, 2021, 4:19 PM IST

కడప జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 15 మంది ఎర్రచందనం స్మగ్లర్ల(Smugglers)ను అరెస్టు చేసి.. 57 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

కృష్ణంపల్లిలో

పోరుమామిళ్ల మండలం కృష్ణంపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో.. ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు సిద్ధమవుతున్న.. స్మగ్లర్ల(Smugglers)పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేశారు.

వీరబల్లిలో

వీరబల్లి మండలం గడికోట గ్రామం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్ల(Smugglers)పై.. పోలీసులు దాడులు చేసి 40 ఎర్రచందనం దుంగలను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది స్మగ్లర్ల(Smugglers)ను అరెస్టు చేశారు. అరెస్టయిన స్మగ్లర్ల(Smugglers)లో ముగ్గురిపై పీడీ యాక్ట్ ను నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందన్నారు.

ఇదీ చదవండి:నడి రోడ్డుపై నవజాత శిశువు.. చీమలు కుట్టడంతో గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details