కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సిద్ధారెడ్డిగారిపల్లి - తలుపుల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని కడపకు వస్తుండగా.. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 7 మంది పిల్లలు, 5 మంది పెద్దలు ఉన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులల్లో కొందరు పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురం వాసులు కూడా ఉన్నారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. 12 మందికి తీవ్ర గాయాలు - devotees car overturned in kadapa district
Devotees car overturned in YSR district: కడప జిల్లా సిద్ధారెడ్డిగారిపల్లి- తలుపుల రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో 12 మంది గాయపడగా.. ముగ్గురు చిన్నారు పరిస్థితి విషమంగా ఉంది. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది.
![దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. 12 మందికి తీవ్ర గాయాలు కడపలో కారు బోల్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15304664-658-15304664-1652728883029.jpg)
car overturned in kadapa district