ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశ్చర్యం.. ఒకే మొక్కకు 11 జొన్న కంకులు..! - gayatri ashram plants special in kadapa

సాధారణంగా ఒక మొక్కకు ఒక జొన్న కంకి వస్తుంది. ఎక్కడైనా 2 లేదా మహా అంటే మూడు కంకులు చూసి ఉంటాం. ఇక్కడ ఏకంగా ఒకే ఒక మొక్కకు 11 జొన్న కంకులు ఏర్పడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఆ విశేషమేంటో చూద్దామా..!

ఆశ్చర్యం.. ఒకే మొక్కకు 11 జొన్న కంకులు..!
ఆశ్చర్యం.. ఒకే మొక్కకు 11 జొన్న కంకులు..!

By

Published : Aug 15, 2020, 7:17 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని శ్రీ గాయత్రి వృద్ధాశ్రమంలో ఓ జొన్న మొక్క అందరినీ ఆకర్షిస్తోంది. ఎక్కడైనా ఒక జొన్న మొక్కకు ఒకటి లేదా రెండు కంకులుంటాయి. కానీ ఇక్కడ మొక్కకు ఏకంగా 11 కంకులు కాయడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది.

జొన్నలు చెరిగినప్పుడు భూమిలో పడి అలా మొక్క మొలిచిందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుంటుందని వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్​రెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details