కడపలో 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 మంది అరెస్టు చేశారు. వీరు గుట్కాలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని కడపలో విక్రయాలు చేసేవారు. నగరంలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
రూ.10 లక్షల విలువ చేసే గుట్కా బస్తాలు స్వాధీనం - 10 lakhs gutka seized
కడప ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు కడప నగరంలో నిఘా విభాగం పోలీసులు గుట్కా నిల్వల కేంద్రాలపై దాడులు చేశారు. దాడుల్లో 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా బస్తాలను స్వాధీనపరచుకున్నారు.
రూ.10 లక్షల విలువ చేసే గుట్కా బస్తాలు స్వాధీనం