విశాఖ జిల్లా పాడేరు నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సూత్రధారితో పాటు విక్రయాలు చేస్తున్న మహిళను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లెకు చెందిన జంబు రమేష్ అనే వ్యక్తి పాడేరులో కిలో రూ.2500తో కొనుగోలు చేసి రైలు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హోల్‌సేల్‌గా కిలో రూ.8వేలు.... రిటైల్‌గా కిలో రూ.10 వేలుతో విక్రయిస్తున్నట్లుగా అందిన సమాచారంతో రమేష్‌తో పాటు మహిళను అరెస్ట్ చేసామన్నారు. నిందితుల నుంచి 1.75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
మైదుకూరులో 1.75 కిలోల గంజాయి స్వాధీనం - కడప జిల్లాలో గంజాయి పట్టివేత తాజా న్యూస్
విశాఖ జిల్లా పాడేరు నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సూత్రధారినితోపాటు విక్రయాలు చేస్తున్న మహిళను మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
1.75 cannabis seized in maidukur