పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 48 జడ్పీటీసీ స్థానాలు, 863 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ ప్రక్రియ అనంతరం ఏలూరు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానాలు, 73 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు మినహాయించి.. 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జడ్పీటీసీ స్థానాలకు 187 మంది.. ఎంపీటీసీ స్థానాలకు 2041 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా లేదంటూ.. తెదేపా తప్పుకోవడంతో, వైకాపా, భాజపా, జనసేన పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. ఎన్నికలు జరిగే చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా.. లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల నిబంధనావళి నాలుగు వారాల పాటు అమలులో ఉండేలా తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో అభ్యర్థులు ఖంగు తిన్నారు.
హైకోర్టు తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఆందోళన - హైకోర్టు తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఆందోళన వార్తలు
పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి.. గతంలో ఆగిపోయినప్పటి నుంచి ప్రక్రియను తిరిగి కొనసాగించాలన్న నాయస్థానం ఆదేశాలు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.
zptc and mptc