పోలీసులతో వైకాపా నేతల వాగ్వాదం
ఏలూరు పోలీసు స్టేషన్లో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. వైకాపా మీడియా సమన్వయ కర్తను విడుదల చేయాలంటూ వాగ్వాదానికి దిగారు.
వైకాపా కార్యకర్తల ఆందోళన
వైకాపా మీడియా కో-ఆర్డినేటర్ కామరెడ్డి నానిను ఏలూరు 3వ పట్టణ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో నానిను రెండో నిందితుడుగా గుర్తించారు. దీంతో స్థానిక వైకాపా నాయకులు భారీ ఎత్తున పోలీసు స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు.నానిను విడుదల చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.