ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జెస్ట్ జోక్ చేశా.. ఆ గుర్తుకు ఓటేయ్యమని ! - గోపీనాథపట్నంలో వైకాపా ప్రచారం

ఏ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీకే ఓటేయ్యాలని చెబుతారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో వైకాపా ఎమ్మెల్యే చేసినా ప్రచారం నవ్వులు పూయించింది. వాహనంపై నిల్చుని పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పి..చివరికీ 'సైకిల్' గుర్తుకు ఓటెయ్యమని అనడంతో అక్కడున్నా వారంతా నవ్వారు. తర్వాత.. తేరుకున్న ఎమ్మెల్యే.. 'జోక్ చేశాను' అని ప్రసంగం మొదలుపెట్టాడు.

ysrcp mla were asking votes for  cycle symbol at unguturu
ఉంగుటూరులో నవ్వులు పూయించిన ప్రచారం

By

Published : Apr 5, 2021, 12:06 PM IST

సైకిల్​కి ఓటువెయ్యమని చెబుతున్న వైకాపా ఎమ్మెల్యే

'వైకాపా తరపున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను గెలిపించాలి అంటే సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి' అని వైకాపా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో చెప్పడం పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత శుక్రవారం ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో జడ్పీటీసీ అభ్యర్థిని కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థిని గంటా శ్రీలక్ష్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మీ ముందుకు వచ్చారని.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి వారిని గెలిపించాలని' అన్నారు. దీంతో ప్రచార రథం పై ఉన్న అభ్యర్థులు, నాయకులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే వాసు బాబు తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి పారిపోయిందని గుర్తుకు రావడంతో సరదాగా జోక్ చేశానని అన్నారు.

ఇదీచూడండి. భారీ పీత.. ధర మెండు

ABOUT THE AUTHOR

...view details