పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో యువకులు స్వచ్ఛందంగా రోజుకు 200 మంది వృద్ధులకు ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వృద్ధులు, పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి.. విరాళాలు వేసుకుని భోజనం ఏర్పాటు చేశామని వారు తెలిపారు. వీరు చేస్తోన్న సహాయానికి మెచ్చి గ్రామానికి చెందిన ఏసోబు అనే రైతు తన వంతుగా రూ.25 వేలు అందించాడు.
యువత ఔదార్యం.. పేదలకు ఆహారం పంపిణీ - lockdown
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలు ప్రాంతాల్లో దాతలు, యువత ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వలిలో పేదలకు యువత స్వచ్ఛందంగా ఆహారం అందిస్తున్నారు.
పేదలకు ఆహార ప్యాకెట్లు అందజేస్తోన్న యువకులు