పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నరసాపురం ఎస్సై వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. మణికంఠారెడ్డి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై.. అతని ఒంటిపై నీళ్లుపోశారు. పోలీసుల వేధింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని బాధితుడు వాపోయారు.
పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం - పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం ఎదుట జరిగింది. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది బాధితుడి ఒంటిపై నీళ్లుపోశారు.
![పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10464738-49-10464738-1612194995648.jpg)
పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి