ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేయసి మోసం చేసిందని...యువకుడు బలవన్మరణం - ప్రేమలో విఫలమై యువకుడు ఆత్మహత్య వార్తలు

స్నేహితుడు, తన ప్రేయసి కలిసి మోసం చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Young man commits suicide in Bhimavaram for love failure
Young man commits suicide in Bhimavaram for love failure

By

Published : Jun 27, 2020, 4:59 PM IST

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం-ఉండి రైల్వేస్టేషన్ మధ్య రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియో తీసి.. తన బంధువులకు పంపాడు. అందులో తన మరణానికి ఇద్దరు కారణమని చెప్పాడు.

చివరి మాటలివే...

నేను కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితుడు ఆ అమ్మాయికి నాపై తప్పుడు మాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. నా చావుకు కారణం వాళ్లే. పోలీసులు వాళ్లని వదలొద్దు. క్షమించండి అన్నయ్యా

మృతుడు భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన జక్కంపూడి కనకారావుగా రైల్వే పోలీసులు గుర్తించారు. అతని తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగగా... సెల్ఫీ వీడియో శనివారం బయటపడింది.

ఇదీ చదవండి

పిల్లలు పుట్టలేదని భర్త చిత్రహింసలు.. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details