పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలోని యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారికి చలిమిడి, పానకము ప్రసాదంగా సమర్పించి మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు , పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పురోహితులు దండకం పఠించారు. అమ్మవారి కిరీటంపై ఉంచిన పుష్పాలు దండకం చదివే సమయంలో కింద పడ్డాయని భక్తుల సంతోషం వ్యక్తంచేశారు. ఆ పూలు తీసుకుంటే కోరికలు తీరుతాయని వారి విశ్వాసం.
వైభవంగా యల్లారమ్మ వసంతోత్సవాలు - tanuku
మండపాకలో కొలువై ఉన్న యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

వైభవంగా యల్లారమ్మ వసంతోత్సవాలు