పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వెలిసిన యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి (బుధవారం) ప్రధానంగా గరగోత్సవం జరగనుంది. రేపు సిరిబండి ఉత్సవం జరుగుతుంది. ఉత్సవాలకు పాలకవర్గం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. తల్లి కిరీటంపై పూలు ఉంచి తమ కోరికను తెలుపుతూ దండకం చదివితే.. అమ్మవారి కిరీటం నుంచి పూలు కిందకి పడటం ప్రత్యక్షంగా చూడవచ్చని భక్తులు తెలుపుతున్నారు. అలా జరిగితే తాము అనుకున్న పనులు తప్పక పూర్తవుతాయని భక్తులు నమ్ముతారు.
యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం - vasantotsavalu
మండపాకలో వేంచేసి ఉన్న యల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా చైత్రమాసంలో ఉత్సవాలు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ.
ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు