పోలవరంలో వైకాపా శ్రేణుల సంబరాలు - ycp-sabaralu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురులేకుండా దూసుకుపోతున్న వైకాపా విజయాన్ని హర్షిస్తూ వైకాపా శ్రేణులు సంబరాలు ప్రారంభించారు.
![పోలవరంలో వైకాపా శ్రేణుల సంబరాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3357035-thumbnail-3x2-wg.jpg)
jagan
పోలవరంలో వైకాపా శ్రేణుల సంబరాలు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో వైకాపా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలంలో వైకాపా నాయకులు ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. జీలుగుమిల్లి ప్రధాన సెంటర్లో ఇప్పటికే పోలీసులు సంబరాలపై నిఘా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి ఫలితాల అనంతరం సాయంత్రం నుంచి ప్రధాన సెంటర్లో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకోనున్నారు.