పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద... జాతీయ రహదారిపై వైకాపా ఆధ్వర్యంలో దళితసంఘాలు ధర్నా చేశాయి. దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చింతమనేని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్లమేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగింది. పోలీసులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించారు.
ఇవి కూడా చదవండి