అమరావతిలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పెయిడ్ ఆటో కళాకారులను ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేశారని ఆరోపించారు. జైళ్లలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శికి సింహాచలం ట్రస్ట్ భూములపై ఆసక్తి ఎందుకో అని ప్రశ్నించారు. మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై ఉన్న ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
'ఆ నేతకు సింహాచలం భూములపై ఆసక్తి ఎందుకో?'
ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై వైకాపా నేతలకు ప్రశ్నలు సంధించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సింహాచలం ట్రస్ట్ భూములపై ఉన్న ఆసక్తి ఏంటో అర్థం కావడం లేదన్నారు. అమరావతి ఉద్యమంపై మాట్లాడిన ఆయన పెయిడ్ ఆటో కళాకారులను ప్రశ్నిస్తే రైతులకు బేడీలు వేస్తారా అని నిలదీశారు.
mp raghurama krishna raju