ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం గారు మీరు అభివృద్ధి అంటుంటే కామెడీగా ఉంది..! - సీఎం జగన్​పై రఘరామకృష్ణరాజు విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు వాగ్బాణాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జంధ్యాల సినిమా కన్నా కామెడీగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గణేష్ చతుర్థిపై హిందువుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఏం జరిగినప్పటికీ అమరావతి రైతులదే అంతిమ విజయం అని చెప్పారు.

ycp mp raghu rama krishna raju sensational comments on cm jagan
ycp mp raghu rama krishna raju sensational comments on cm jagan

By

Published : Aug 20, 2020, 5:24 PM IST

ప్రభుత్వంపైన.. ముఖ్యమంత్రిపైనా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు చమత్కార బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను తాము అభివృద్ధి చేస్తామని చెప్పడంపై సెటైర్లు వేశారు. "మీరు వైజాగ్ ను అభివృద్ధి చేయడం జంధ్యాల సినిమా కన్నా కామెడీ" అని వ్యాఖ్యానించారు.

భూమండలంలోనే లేదు.

వైకాపా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం భూమండలంలోనే ఎక్కడా లేదన్నారు. ఎవరికైనా పరిశ్రమ ప్రారంభించడానికి సబ్సిడీ ఇస్తారు. మీరేంటో పరిశ్రమ పెట్టి విజయవంతం అయితే ఇస్తాం అంటున్నారు. "ఎలాగూ సక్సెస్ కాదు.. మీరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు.." అన్నారు. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.

మతం మార్చుకోకున్నా అభిమతం మార్చుకోండి

గణేష్ చవితి ఉత్సవాల విషయంలో హిందువుల మనోభావాలను గౌరవించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఈ విషయంలో ఏపీ భాజపా అధ్యక్షుడు ఒకలా.. తెలంగాణలో మరోలా ఉన్నారని చెప్పారు. గణపతి ఉత్సవాలు అనుమతి ఇవ్వాలని బండి సంజయ్ కోరితే ఆంధ్రప్రదేశ్ భాజపా​ అధ్యక్షుడు వింత విధానాలు సూచిస్తున్నారని విమర్శించారు. గణేష్ నవరాత్రులను ఒక రాత్రి నుంచి ఒక పగలుకు తీసుకొచ్చారని.. ఇళ్లల్లోనే బకెట్లలో నిమజ్జనాలు చేసుకోవాలంటున్నారని చెప్పారు. సోము వీర్రాజు చెప్తున్న ఈ వింత కాన్సెప్ట్ జనాలకు అర్థం కావడం లేదన్నారు.

కరోనా సమయంలోనూ చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు జరిగాయని.. హిందువుల ముఖ్య పండుగ అయిన గణేష్ చతుర్ధి ఉత్సవాలపై ఆంక్షలు పెట్టవద్దని కోరారు. "మీరు మతం మార్చుకోలేరు కాబట్టి .. అభిమతం మార్చుకోండి. " అని ముఖ్యమంత్రిని కోరారు.

అంతిమ విజయం అమరావతిదే

అమరావతి విషయంలో కేంద్రం వేసిన అఫిడవిట్ కాస్త అసంతృప్తికి గురిచేసినా భయం అక్కర్లేదని చెప్పారు. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని చెప్పినప్పటికీ. మూడు రాజధానులకు కేంద్రం మద్దతు ఇవ్వలేదన్నారు. రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ ఉండాలంటూ. ఒక్క రాజధాని విషయమే ప్రస్తావించిందన్నారు. న్యాయపరంగా వెళ్లాలని కేంద్రం కోర్టును కోరిందని... అమరావతి రైతులకే న్యాయం దక్కుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details