అమరావతిని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తే కొన్ని దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి జగన్కు తిరుగుండదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని ఆయన తప్పుబట్టారు. కోర్టుల్లో పిటిషన్ల కోసం ప్రజాధనం వృథా చేయటం సరికాదన్నారు.
రాజధాని మార్పుపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని... కరోనా నియంత్రణలో అలసత్వం ప్రదర్శిస్తోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. రాష్ట్రంలో శానిటైజర్ వల్ల మరణాలు బాధాకరమన్న ఆయన... ఈ మరణాలు ఆగాలంటే పెంచిన మద్యం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.