ప్రధాని మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. మోదీ నాయకత్వంలో కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఈ నిధి పెద్ద ఉపశమనమని అన్నారు.
అలాగే.. పీఎం ఆవాస్ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని ఎంపీ రఘరామకృష్ణరాజు మోదీని ప్రశంసించారు. మరో పథకమైన పీఎం గరీబ్ కల్యాణ్ యోజన నవంబరు వరకు పొడిగించటం మంచి నిర్ణయమని లేఖలో పేర్కొన్నారు. దీని ద్వార 81 కోట్లమంది పేదల ఆకలి తీరుతుందని పేర్కొన్నారు. పేదలకు ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.