తనపై అనర్హత వేటు వేయాలని వైకాపా ఎంపీలు స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్బుట్టదాఖలు అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని రఘురామకృష్ణరాజు కలిశారు.
నాపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకం: రఘురామకృష్ణరాజు - వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు తాజా వార్తలు
వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఆయన.. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకం పోయిందని చెప్పారు.
కేంద్ర బలగాల ద్వారా భద్రత కల్పించాలని హోం శాఖ కార్యదర్శిని కలిసి మరోసారి కోరాను. సాధారణంగా భద్రత కల్పించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర పోలీసు, రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తారనే నమ్మకం పోయింది. మా ఎమ్మెల్యేలే నాపై కేసులు పెడుతున్నారు. అందువల్లనే కేంద్ర బలగాల రక్షణ కోరాను. భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం జరగాల్సి ఉంది. అందువల్ల ఆలస్యమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాల రక్షణ వస్తుంది. ఒక ఎంపీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అది కల్పించనప్పుడు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది- రఘురామకృష్ణ రాజు, నరసాపురం ఎంపీ