తణుకులో మోహన్ బాబు ఎన్నికల ప్రచారం పశ్చిమగోదావరిజిల్లా తణుకులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సినీనటుడు మోహన్ బాబురోడ్‌షో చేశారు.పంటలు పండని బీడు పొలాలలో అమరావతిని కట్టాలని చెప్పితే పచ్చని పంటపొలాలలో కట్టారన్నారు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగినపుడు తన స్నేహితుడికి ఇలా జరిగిందేఅని వైఎస్‌రాజశేఖరరెడ్డి బాధ పడ్డారని, ఇపుడు జగన్‌పై దాడి జరిగితే కోడికత్తి దాడి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్నారు. 125 నుంచి 130 సీట్లును జగన్ గెలుచుకుంటారని ఆశాభావం వెలిబుచ్చారు.
ఇవి చూడండి..