పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు వరుసపెట్టి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు బాటలోనే... మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా రఘురామపై భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా ఎమ్మెల్యేల ఫిర్యాదు - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు
ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా ఎమ్మెల్యే ఫిర్యాదు
11:18 July 09
వైకాపా ఎంపీపై పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు
ప్రసాద్‌రాజు సైతం
ఎంపీ రఘురామకృష్ణమరాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసాపురం పీఎస్‌లో వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు సైతం ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి..
'అప్పుడు ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు'
Last Updated : Jul 9, 2020, 12:31 PM IST