ఇంటి స్థలాల పంపిణీలో వైకాపా నాయకులు మామూళ్లు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినందుకు... తమకు స్థలాలు ఇవ్వడం లేదంటూ... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రజలు..... అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. వైకాపా నాయకులు మామూళ్లు వసూలు చేస్తున్నారని... డబ్బు ఇచ్చిన వారికే స్థలాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇంటిస్థలాలు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి... అదే స్థలాల్లో ఇతరులకు పట్టాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి... తమను ఆదుకోవాలని కోరారు.
వైకాపా నాయకుల వసూళ్లు... డబ్బులిచ్చిన వారికే ఇంటి స్థలం - పేదలందరికి ఇళ్లు పథకంలో వైకాపా నేతల వసూళ్లు
అర్హులైన పేదలందరికీ ఇళ్లు అని అనుకుంటే పొరపాటే. కొంత మంది వైకాపా నాయకుల చేతులు తడిపితేనే ఇళ్లని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులంటున్నారు. వారికి అర్హత ఉన్నా... డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇంటి స్థలాలు రద్దు చేశారని వాపోతున్నారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇళ్ల స్థలాల బాధితుల ఆందోళన