ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

gravel mafia: దళితుల భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వకాలు.. - అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్న మాఫియా

సాధారణంగా ఎవరైనా.. సొంత భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తుంటారు. కానీ వైకాపా నాయకులు(మట్టి మాఫియా) ఒక అడుగు ముందుకేసి ఏకంగా పక్కవారి భూమిలో గ్రావెల్​ తవ్వకాలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న దళిత భూ యజమాని.. ఇదేంటని ప్రశ్నించగా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు గ్రామంలో చోటుచేసుకుంది.

illegal soil excavation at chebrolu
చేబ్రోలు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు

By

Published : Sep 9, 2021, 2:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం మట్టి మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. మండలంలోని చేబ్రోలు గ్రామంలో దళిత మహిళకు చెందిన భూమిలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు దొంగచాటుగా గ్రావెల్​ను తవ్వి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న భూ యజమాని.. తవ్వకాలను వాడుకునే ప్రయత్నం చేయగా అతనిపై దాడికి యత్నించారని బాధితుడు తెలిపారు. దీంతో మట్టి మాఫియా దౌర్జన్యంపై చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఒక జేసీబీ, ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ బడా వైకాపా నేత.. స్వాధీనం చేసుకున్న వాహనానాలను వదిలేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details