ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిందితులను వదిలేసి... అమాయకులపై కేసులేంటి?' - ఏపీలో దేవాలయాలపై దాడులు వార్తలు

వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర భాజపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి సర్కార్​ తీరుపై మండిపడుతున్నారు. నిందితులను పట్టుకోలేని సర్కార్... అమాయకులపై కేసులు పెడుతోందని దుయ్యబట్టారు.

ap bjp leaders
ap bjp leaders

By

Published : Sep 16, 2020, 7:15 PM IST

రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు సహా భాజపా నేతల బృందం రాజ‌్‌భవన్‌లో గవర్నర్‌ను బుధవారం కలిశారు. హిందూ ఆలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలను సోము వీర్రాజు గవర్నర్‌కు వివరించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లిన 41 మందిపై కేసులు కేసులు నమోదు చేసి... నేటికీ బెయిల్‌ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారని భాజపా బృందం గవర్నర్‌కు వివరించింది. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరినట్లు తెలిపారు.

'ఆ మంత్రికి ఏపీలో ఉండే అధికారం లేదు'

రాష్ట్రంలోని పలు దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటని రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిని పట్టుకోకుండా భక్తులను విచారణకు పిలవడం హాస్యాస్పదం అన్నారు. అంతర్వేది రథం దగ్ధం కేసులో జైల్లో పెట్టిన మహిళా భక్తులను 48 గంటలలోపు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా... ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు రాష్ట్రంలో ఉండే అధికారం లేదన్నారు.

'వైకాపా వచ్చాకే దాడులు'

వైకాపా అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగాయని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు ఆరోపించారు. కడప జిల్లా రాజంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్వేది సంఘటనను మర్చిపోకముందే... దుర్గమ్మ అమ్మవారి రథంపై 3 సింహాలు మాయం కావడం వెనక అంతర్యమేమిటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా లక్కతో చేసిన ప్రతిమలు దర్శనమిచ్చాయన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను పరిశీలించేందుకు వెళ్తున్న భాజపా నాయకులను గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు.

'అడ్డదారిలో వైకాపా నాయకులు'

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా నాయకులు ఇతరుల పట్ల దౌర్జన్య, అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కదిరి సబ్ జైలులో ఉన్న తమ పార్టీకి చెందిన ఓ నాయకుడిని పరామర్శించేందుకు భాజపా సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. పార్థసారథి, గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం మిలాఖత్ కుదరని జైలు అధికారులు చెప్పటంతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భాజపా నేతలు... అధికారపార్టీ నాయకుల తీరును తప్పుపట్టారు. వైకాపా నాయకులు... విపక్షనాయకులు, సాధారణ ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details