'స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి' - undefined
నరసాపురంలో వైసీపీ విజయోజత్సవ అభినంధన సభలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
!['స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3644785-48-3644785-1561343597691.jpg)
ముఖ్యమంత్రి జగన్ అవినీతి రహిత పాలనలో అందరూ భాగస్వాములై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని అందించాలని పశ్చిమగోదావరి జిల్లాలోని మంత్రులు , ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన వైసీపీ పార్టీ విజయోత్సవ అభినందన సభలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ...ఇచ్చిన హామీలను కొద్ది రోజుల్లోనే అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కిందని అన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి తాగునీటిని అందించేందుకు సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని ,త్వరలోనే శంకుస్థాపని చేస్తారని స్పష్టం చేశారు. తమను ఎన్నికల్లో గెలిపిచిన నాయకులు, కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించేలా పాలన జరగబోతుందని వైసీపీ ఎంపీ రఘరామకృష్ణమరాజు జోస్యం చెప్పారు. ప్రజాప్రతినిధులను నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.