ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమవరం అభివృద్ధిపై వైకాపా, జనసేన సవాళ్లు - ప్రతిసవాళ్లు ! - వైకాపా, జనసేన సవాళ్లు - ప్రతిసవాళ్లు

భీమవరం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైకాపా, జనసేన నాయకులు సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

భీమవరం అభివృద్ధిపై వైకాపా, జనసేన సవాళ్లు - ప్రతిసవాళ్లు
భీమవరం అభివృద్ధిపై వైకాపా, జనసేన సవాళ్లు - ప్రతిసవాళ్లు

By

Published : Mar 3, 2020, 10:35 PM IST

భీమవరం అభివృద్ధిపై వైకాపా, జనసేన సవాళ్లు - ప్రతిసవాళ్లు

భీమవరం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైకాపా, జనసేన నాయకులు సవాళ్లు - ప్రతిసవాళ్లు చేసుకున్నారు. మున్సిపల్​ ఆఫీస్ వద్దకు చర్చకు రావాలని వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​కు జనసేన నేత గోవిందరావు సవాల్ విసిరారు. కాగా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం మున్సిపల్ ఆఫీస్​లో కాకుండా తాడేరు వద్దకు వచ్చి చర్చలో పాల్గొనాలని గోవిందరావుకు ప్రతి సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకు గోవిందరావు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించగా... వైకాపా నేతలు తాడేరు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడం వల్ల పోలీసులు గోవిందరావును ఇంటికి తరలించారు. అనంతరం వివాదం సద్దుమణిగింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details