పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం అంకంపాలెంలో ఇంటిలోకి అర్ధరాత్రి చొరబడి, మహిళపై దాడి చేసిన యువకులను శిక్షించాలని స్థానిక యాదవ సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ముగ్గురు యువకులు రాత్రి ఒంటి గంటకు ఇంటిపై దాడి చేశారని సంఘం మండల అధ్యక్షుడు నాలి శ్రీను అన్నారు. మహిళతో పాటు చిన్నారులపై కూడా దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. విచక్షణారహితంగా కొట్టిన వారిని నిర్బంధించి పోలీసులకు అప్పగిస్తే, దళితులపై దాడి చేశారనే నెపంతో తమపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
అంకంపాలెంలో యాదవ సంఘం సభ్యుల నిరసన - జీలుగుమిల్లి మండలం అంకంపాలెంలో యాదవ సంఘం సభ్యులు
జీలుగుమిల్లి మండలం అంకంపాలెంలో యాదవ సంఘం సభ్యులు నిరసనకు దిగారు. అర్ధరాత్రి మహిళ ఇంటిపై ముగ్గురు యువకులు దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు. వారిని నిర్బంధించి పోలీసులకు అప్పగిస్తే తమపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అధికారులను కోరారు.
యాదవ సంఘం సభ్యుల నిరసన