ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

World Zoonosis Day: రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ జునోసిస్ డే అవగాహన సదస్సులు

ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెంపుడు శునకాలకు ఉచితంగా టీకాలు వేశారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించటమే జునోసిస్ డే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జూనోటిక్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.

World Zoonosis Day
ప్రపంచ జునోసిస్ డే

By

Published : Jul 6, 2021, 7:48 PM IST

ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పెంపుడు శునకాలకు ఉచితంగా టీకాలు వేశారు. జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంపొందించే కరపత్రాలను అధికారులు విడుదల చేశారు. జూనోటిక్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.

పశ్చిమ గోదావరి జిల్లా..

ఏలూరులో జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నెహ్రూ బాబు తెలిపారు. నగరంలోని 3,500 కుక్కలను వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో..

జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెంపుడు జంతువులకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డా.ఎం.కిశోర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంపొందించే కరపత్రాలను విడుదల చేశారు. వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.

కృష్ణా జిల్లాలో...

దివిసీమలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ టీకాలను వేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెంపుడు శునకాలకు వ్యాక్సిన్​ వేశారు.

గుంటూరు జిల్లాలో..

ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో పెంపుడు శుకనాలకు ఉచిత వ్యాక్సిన్ క్రార్యక్రమాన్ని చేపట్టారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి... రోగాల బారిన పడకుండా చూడటమే జునోసిస్ డే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో టీకాలు వేసే కార్యక్రమంలో అధికారులు మార్పులు చేశారు. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నంబర్లు కేటాయించి రోజూ పరిమిత సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని వెళ్లేలా చర్యలు చేపట్టారు.

జునోసిస్ డే ఎందుకు?

లూయూ పాశ్చర్ అనే శాస్త్రవేత 1885 జూలై 6వ తేదీన మొట్టమొదటి సారిగా యాంటీ రేబీస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజును జునోసిస్ డే గా జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజును యాంటీ రేబీస్ డే గా కూడా పిలుస్తారు.

ఇదీ చదవండి:

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 3,042 కరోనా కేసులు, 28 మరణాలు

ABOUT THE AUTHOR

...view details