పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు కేతా త్రిమూర్తులు సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామంలో 10 వార్డుల్లో తెదేపా మద్దతుదారులు వార్డు సభ్యులుగా గెలుపొందారు. వీరు ఎన్నికకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది.
సోమవారం పంచాయతీ కార్యాలయంలోని సర్పంచి ఛాంబర్‌కు వచ్చిన త్రిమూర్తులు.. తిరిగి వెళ్లెప్పుడూ ఆ గదికి తాళం వేసుకొని వెళ్లారు. అయితే తెదేపా మద్దతుతో గెలిచిన వార్డుసభ్యులు ఈ రోజు కార్యాలయానికి వచ్చారు. సర్పంచి ఛాంబర్ గదికి తాళం ఉండటంతో నిరసన వ్యక్తం చేశారు. సర్పంచి వైఖరికి నిరసనగా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.