పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 56 పంచాయతీ స్థానాలున్నాయి. వాటిలో 29 స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటితో పాటు మరో నాలుగు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. నిడదవోలు మండలం కోరుమామిడి, తాడిమళ్ల గ్రామాలను ఎస్సీ జనరల్, సూరాపురం గ్రామాన్ని ఓసి జనరల్‌కు కేటాయించగా అదే కేటగిరికి చెందిన మహిళలు విజయం సాధించారు. పెరవలి మండలం తీపర్రు గ్రామాన్ని బీసీ జనరల్‌కు కేటాయించగా.. అక్కడ సైతం మహిళ అభ్యర్థే విజయ ఢంకా మోగించారు.
ఆ నియోజకవర్గంలో మహిళలు సత్తాచాటారు..! - panchayat elections in nidadavolu constituency
ఆ నియోజకవర్గంలో మహిళలే మహారాణులు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి తమ సత్తా చాటారు. ఇంటికే పరిమితమైన గృహిణిలు సైతం విజయ భేరీ మోగించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఈ విశేషం జరిగింది.
ఆ నియోజకవర్గంలో మహిళలే మహారాణులు
నిడదవోలు మండలం 23 పంచాయతీలకు 12 పంచాయతీలు మహిళలకు కేటాయించగా 15 స్థానాల్లో, పెరవలి మండలం 18 పంచాయతీలకు 9 పంచాయతీలు మహిళలకు కేటాయించగా 10 స్థానాల్లో గెలుపోందారు. ఉండ్రాజవరం మండలం 15 పంచాయతీలకు 7పంచాయతీల్లో మహిళలు విజయం సాధించారు.
ఇదీ చదవండి...