రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో.. మహిళా ఓటర్లు తమ ప్రభావం చూపనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో రెండో దశ ఎన్నికలు జరగనుండగా.. తణుకు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో.. తణుకు నియోజకవర్గంలో.. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలు ఉన్నాయి. తణుకు మండలంలో 1,111మంది, అత్తిలిలో 754, ఇరగవరంలో 611 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నిడదవోలు మండలంలో 528 మంది, పెరవలిలో 57 మంది, ఉండ్రాజవరం మండలంలో 1096 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో.. తణుకు నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో ఓటర్ల వివరాలు:
మండలం | పురుషులు | మహిళలు | ఇతరులు | మొత్తం |
నిడదవోలు | 27586 | 28114 | 4 | 55704 |
పెరవలి | 27649 | 27706 | 0 | 55357 |
ఉండ్రాజవరం | 28841 | 29937 | 3 | 58781 |
తణుకు | 23967 | 25078 | 0 | 49045 |
అత్తిలి | 27485 | 28239 | 4 | 55728 |
ఇరగవరం | 26318 | 26929 | 1 | 53248 |
నామినేషన్ల ఉపసంహరణ తరువాత.. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే వారి సంఖ్య స్పష్టమైంది. నియోజవర్గంలో 56 పంచాయతీలకు.. 5 సర్పంచి పదవులు ఏకగ్రీవం కాగా మిగిలిన 51 పంచాయతీల్లో 135 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.