అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..? - east godavari district latest news
ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన పెరవలి సత్యనారాయణ-నిర్మల కుమార్తె ఉమాదేవి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెరవలి సత్య నారాయణ-నిర్మల కుమార్తె ఉమాదేవికి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామానికి చెందిన గానుగుల సత్యసూర్యనారాయణకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు 4 వారాల క్రితం పుట్టినిల్లు వెల్లమిల్లికి వచ్చారు. ఉమాదేవి మంగళవారం బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇటుకులగుంట వాగులోకి జారిపడి కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఉమాదేవి ఆచూకీ కోసం వాగులో గాలించారు. కొద్దిసేపటికి ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.