ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - undefined

పశ్చిమ గోదావరి జిల్లా రేలంగికి చెందిన సూర్యవతి అనే మహిళ ఉరి వేసుకుని చనిపోయింది. రెండు రోజులైనా తలుపులు తెరవనందున స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

died

By

Published : Sep 7, 2019, 10:45 PM IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగిలో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఒంటరిగా నివసిస్తున్న సూర్యవతి ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. తోబుట్టువులు దూరంగా ఉంటున్నారు. సూర్యవతి సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. రెండు రోజులుగా సూర్యవతి ఇంటి నుంచి బయటకు రాలేదు. అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరి వేసుకున్న తాడు తెగిపోయి కింద పడి పోయినట్లు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details