పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో రెవిన్యూ అధికారులు తన భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం బలవంతంగా తీసుకుటుంన్నారని ఆరోపిస్తూ.. ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మి అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారుల ఎదుట పురుగుల మందు తాగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇళ్ల స్థలాల కోసం భూమి లాక్కున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం - ఇళ్ల స్థలాల కోసం భూమి లాక్కున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం !
తన భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రెవిన్యూ అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తూ..ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో చోటుచేసుకోగా...బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు.
ఇళ్ల స్థలాల కోసం భూమి లాక్కున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం !
సుమారు నలభై సంవత్సరాలుగా తాము 96 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని బాధిత మహిళ కుమారుడు బాలు వాపోయాడు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా.. ప్రభుత్వ భూమి అని నోటీసులు జారీ చేసి బలవంతంగా ప్లాట్లు చేస్తున్నారని ఆరోపించారు. తమకున్న ఆధారం కోల్పోవడంతో తన తల్లి మనస్థాపంతో పురుగు మందు తాగిందని తెలిపాడు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.