గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరైనా…. ఆయన పాట, మాట, రూపం చిరస్మరణీయమని తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ అభిప్రాయపడ్డారు. బాలు ఇకలేరన్న విషయం తెలిసిన వెంటనే ఆ మహోన్నత వ్యక్తి విగ్రహ తయారీకి సంకల్పించి గంటల్లోనే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు కావాలని..., తయారు చేయమని అడుగుతున్నారని వారందరికీ త్వరలోనే అందజేస్తానన్నారు. బాలసుబ్రహ్మణ్యంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న దేవికారాణి...వారి సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
'బాలు మాట, పాట, ప్రతిరూపం చిరస్మరణీయం' - బాలు తాజా వార్తలు
దివికేగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిరూపం చిరస్మరణీయంగా నిలిచే ఉంటుందని తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ వ్యాఖ్యనించారు. బాలు విగ్రహాన్ని గంటల్లోనే తయారు చేసిన ఆమె...బాలుతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కళాకారుల మదిలో ఎస్పీ బాలు ప్రతిరూపం చిరస్మరణీయం