ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ యువతి నిరసన దీక్ష చేపట్టింది. పాలకొల్లుకు చెందిన యువతి శంకర శాస్త్రి అనే యువకుడు ప్రేమించుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని శంకర్ శాస్త్రిని అడగగా అందుకు అతను నిరాకరించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టానని.. పోలీసులు బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగినట్లు తెలిపింది. తాను ప్రేమించిన వ్యక్తిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వివాహం జరిపించి తనకు సామాజిక న్యాయం చేయాలని బాధితురాలు అభ్యర్థిస్తోంది
ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలంటూ యువతి ధర్నా - yeluru latest news
ప్రేమ ప్రేమతో వ్యక్తి మోసం చేశాడని.. న్యాయం చేయాలంటూ ఓ యువతి కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగింది. పాలకొల్లు కు చెందిన శంకరశాస్త్రి అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఆరోపించింది. యువకుడి ఇంటి ముందు ధర్నాకు పోలీసులే తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగినట్లు తెలిపింది. ఆ యువకుడితో వివాహం జరిపించాలని ఆమె కోరుతున్నారు.
women protest