పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలోని మద్యం దుకాణంలో అమ్మకాలను నిషేధించాలని.. మహిళలు నిరసనకు దిగారు. కరోనా కేసులు నమోదవుతున్నందున.. మద్యం కొనుగోలుకు మండల కేంద్రమైన భీమడోలు, గుండుగొలను, అంబరు పేట, ఎం.ఎం. పురం నుంచి వస్తున్న వారి వల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళనతో.. మహిళలు దుకాణం వద్ద ఆందోళన చేశారు. దశలవారీగా మద్యపానం నిషేధములో భాగంగా కురెళ్ళగూడెం మద్యం దుకాణాలు మూసివేశారని, మళ్లీ తిరిగి ఈ నెల 21 నుంచి మద్యం అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం దుకాణాలు తెరిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ మహిళల ఆందోళన - మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ మహిళల ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లాలోని కురెళ్లగూడెం గ్రామంలో మద్యం దుకాణం ముందు మహిళలు ఆందోళన చేశారు. మండలంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ మహిళల ఆందోళన