పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో కలుషిత తాగునీటి సరఫరాపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమకు పరిశుభ్రమైన నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ... మహిళలు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా పంచాయితీ అధికారులు కలుషిత తాగు నీటిని సరఫరా చేయడంతో అస్వస్థతకు గురవుతున్నామని వాపోయారు.
'పచ్చగా వస్తున్నాయి.. తాగితే మా పరిస్థితేంటి..?' - పశ్చిమ గోదావరిలో తాగునీటి వార్తలు
చెరువు నీటిని శుభ్రం చేయకుండా ఇవ్వడంతో... పచ్చటి నీళ్లొస్తున్నాయి. ఇలాంటి నీరు తాగితే తమ పరిస్థితి ఏంటని పశ్చిమగోదావరి జిల్లా కొప్పర్రు గ్రామ మహిళలు ఆందోళ చేపట్టారు. పరిశుభ్రమైన నీటిని అందిచాలని కోరుతున్నారు.
women darna for drinking water at kopparru in west godavari district
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అంటున్నారు. చెరువులో నీటిని శుభ్రం చేయకుండా ఇవ్వండంతో పచ్చగా వస్తున్నాయని.. ఇలాంటి నీరు తాగితే తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో ఆలం ప్రాజెక్ట్ ప్రారంభించి... సురక్షిత నీరు అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:'పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధి'