పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఉదయం 9 గంటల నుంచి మందుబాబులు దుకాణాల వద్ద క్యూ కట్టారు. జంగారెడ్డిగూడెంలో మద్యం దుకాణాలు తెరుచుకున్న వెంటనే మందుబాబులు మద్యం సీసాలకు పూజలు చేశారు.
లాక్డౌన్ అనంతరం 40 రోజుల తర్వాత దుకాణాలుు తెరచుకోవడంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ఉన్న వ్యక్తులు మాత్రమే కొనుగోళ్లు చేసేలా అధికారులు, షాపుల నిర్వాహకులు చర్యలు చేపట్టారు.