నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామన్న ప్రభుత్వం.. తమని ఉద్యోగాల నుంచి తొలగించి.. ఉపాధి లేకుండా చేసిందని ఏలూరు కలెక్టరేట్ వద్ద మద్యం దుకాణాల్లో పనిచేసే యువకులు నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువకులు తమకు న్యాయం చేయాలంటూ.. కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 13 శాతం మద్యం దుకాణాలు తొలగించారని.. అందులో పనిచేసే తాము రోడ్ల పాలయ్యామన్నారు. తమకు ఉపాధి కల్పించాలని కోరారు.
మద్యం షాపుల్లో పనిచేసే యువకుల నిరసన
తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ మద్యం దుకాణాల్లో పనిచేసే యువకులు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఏడాది పాటు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం... ఇంకా గడువు తీరక ముందే తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మద్యం షాపుల్లో పనిచేసే యువకులు నిరసన